: జాలర్లకు చిక్కిన వయాగ్రా చేపలు.. కేజీ రూ.1500 మాత్రమే.. గంటల్లోనే రూ.20 లక్షల అమ్మకాలు

వేకువజామున చేపల వేటకు వెళ్లిన జాలర్ల పంట పండింది. తమిళనాడులోని నాగపట్టినం సముద్రంలో జాలర్లు వేసిన వలకు అరుదైన వయాగ్రా చేపలు చిక్కాయి. దాదాపు టన్ను చేపలు దొరకడంతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మూడేళ్లుగా ఒక్క చేపా కనిపించని ఆ ప్రాంతంలో ఏకంగా టన్ను చేపలు పడడంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

‘కూరాకత్తలై’ పేరుతో పిలిచే ఈ చేపలకు భలే గిరాకీ. వీటిని తింటే వీర్యపుష్టి కలుగుతుందని చెబుతారు. అందుకే ధర గురించి ఆలోచించకుండా వాటిని కొనేందుకు ఎగబడతారు. కేజీకి రూ.1500 వరకు ధర పలుకుతోంది. వీటి కడుపు భాగంలో చేతి వేలంత పరిమాణంలో ఉండే ‘నెట్టి’ అనే ప్రాంతాన్ని శుభ్రం చేసి చైనాకు ఎగుమతి చేస్తుంటారు. ‘నెట్టి’ భాగాలు కిలోకు రూ.5 వేలకు పైగానే పలుకుతున్నాయి. ఇక జాలర్ల వలలో పడిన వయాగ్రా చేపలు నాగపట్టినం చేపలరేవు మార్కెట్‌కు వచ్చాయని తెలిసి ప్రజలు ఎగబడ్డారు. దీంతో కొన్ని గంటల్లోనే రూ.20 లక్షల వరకు చేపలు అమ్ముడయ్యాయి.

More Telugu News