: ఆదేశాల ద్వారా సిక్కులపై జోకులు వేయకుండా ఆపడం అసాధ్యం: సుప్రీంకోర్టు

ఆదేశాల ద్వారా సిక్కులపై జోకులు వేయకుండా ఆపడం అసాధ్యమైన విషయమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సిక్కులపై వస్తున్న 'సర్దార్ జోకులు' తమ మతాన్ని తప్పుగా చూపిస్తున్నాయని, ఈ జోకులు వేసే వారిపైన, వెబ్ సైట్లపైన చర్యలు చేపట్టాలని కోరుతూ హర్వీందర్ చౌదరి అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. జోకులు అనేవి సమాజానికి, మనస్తత్వానికి సంబంధించిన అంశమని కోర్టు పేర్కొంది. సిక్కులపై జోకులు ఆపాలంటూ ఒకవేళ కోర్టు మార్గదర్శకాలు జారీ చేస్తే వాటిని ఎలా అమలు చేస్తాము? ఎవరు పాటిస్తారు? అని కోర్టు ప్రశ్నించింది. సిక్కులకు సమాజాంలో చాలా గౌరవం ఉందని, ఇలాంటి పిటిషన్ల ద్వారా ఆ గౌరవాన్ని తగ్గించుకోవద్దని ఈ సందర్భంగా సూచించింది.

More Telugu News