: అన్నీ తెచ్చి అమరావతిలో పెట్టడం కరెక్టు కాదు: వెంకయ్యనాయుడి కీలక వ్యాఖ్య

అభివృద్ధి కోసం ఒకే ప్రాంతాన్ని పట్టుకుని వేలాడటం సరికాదని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. అన్నింటినీ తీసుకువచ్చి అమరావతిలో పెట్టడం మంచిది కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం అమరావతి రైతులకు ఆతిథ్యం ఇచ్చిన తరువాత ఆయన మాట్లాడుతూ, అన్ని జిల్లాల్లోనూ పరిశ్రమలు స్థాపించాల్సిన అవసరం ఉందని, అమరావతి మరో హైదరాబాద్ లా తయారు కాకూడదని అన్నారు. అన్ని జిల్లాల ప్రజలూ సంతోషంగా ఉండాలంటే, మిగతా ప్రాంతాల్లోనూ అభివృద్ధి శరవేగంగా సాగాల్సి వుందని తెలిపారు. రాజధాని అంటే, విద్య, వైద్యం, ఉద్యోగాల కల్పన అని అభివర్ణించిన ఆయన, భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులను అభినందించారు. ఏపీకి కేంద్రం నుంచి పూర్తి సహాయం అందుతుందని, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి పథంలో వెనకున్నాయన్న విషయాన్ని గుర్తెరగాలని సూచించారు.

More Telugu News