: దురాశతో 2,200 మంది మహిళల గర్భసంచీలను తొలగించిన కర్ణాటక డాక్టర్లు

దాదాపు 2,200 మంది కన్నడ మహిళలు డాక్టర్ల దురాశకు గర్భసంచిలను కోల్పోయారు. లంబాడీ, దళిత మహిళలకు శస్త్రచికిత్సలు చేసి తప్పుడు బిల్లులను పెట్టుకుని ప్రభుత్వం నుంచి డబ్బు రాబట్టుకోవడమే లక్ష్యంగా కాలాబుర్గి జిల్లాలో ఈ దారుణం జరిగింది. గత సంవత్సరం ఈ ఉదంతం తొలిసారిగా బయటకు రాగా, ఆరోగ్య విభాగం విచారణ జరిపి, ఆసుపత్రుల అనుమతులు రద్దు చేసినప్పటికీ, అవి మూతపడలేదని తెలుస్తోంది. ఉన్నతాధికారులు లంచాలు తీసుకుని విషయాన్ని మరుగున పడేసినట్టు అనుమానాలున్నాయి.

తమకు న్యాయం చేయాలని కాలాబుర్గి డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట వేలాది మంది మహిళలు, ఆల్టర్నేట్ లా ఫోరమ్, విమోచన, స్వరాజ్ అభియాన్ తదితర ఎన్జీవో సంఘాల నేతృత్వంలో నిరసనలకు దిగడంతో ఈ విషయం మరోసారి చర్చకు వచ్చింది. మానవ హక్కులకు విఘాతం కలిగిస్తూ, మహిళలకు అన్యాయం చేసిన ఆసుపత్రులపై, అక్కడి వైద్యులపై కఠినచర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలిప్పుడు డిమాండ్ చేస్తున్నాయి. కడుపు నొప్పిగా ఉందని, వైట్ డిశ్చార్జ్ అవుతోందని ఆసుపత్రికి వెళ్లిన ప్రతి మహిళకూ వైద్యులు ఆపరేషన్లు చేసి గర్భసంచీలను తొలగించినట్టు తెలుస్తోంది.

More Telugu News