: ముందు ఎన్నికలకు పోదాం... గెలిచి సీఎం అవుతా: అనుయాయులతో శశికళ మంతనాలు

నేడు జరగాల్సిన శశికళ పదవీ ప్రమాణ స్వీకారం వాయిదా పడటంతో ఖిన్నురాలైన శశికళ, ఎన్నికలకు పోయి, గెలిచి, తనకు ప్రజాదరణ ఉందని చూపించిన తరువాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు తన అనుయాయులతో ఆమె సమాలోచనలు మొదలు పెట్టారు. జయలలిత ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై పరిధిలోని ఆర్కే నగర్ లో తనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని భావిస్తున్న ఆమె, మరో నియోజకవర్గాన్ని చూడాలని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో తేని జిల్లాలో గతంలో ఎంజీఆర్, జయలలిత గెలుపొందిన ఆండిపట్టి, మధురై జిల్లాలోని ఉశలంపట్టి, తిరుమంగళం అసెంబ్లీ నియోజకవర్గాలు అనుకూలమని కొందరు తెలిపారు. కాగా, అటువంటిదేమీ అవసరం లేదని, సీఎంగా బాధ్యతలు చేపట్టి, ఆపై ఆరు నెలల్లో ఎక్కడైనా గెలవ వచ్చని మరికొందరు అనుచర నేతలు శశికళను బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News