: 104 ఉపగ్రహాల ప్రయోగ సమయం ముందుకు!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తలపెట్టిన ప్రతిష్ఠాత్మక పీఎస్ఎల్వీ సీ-37 రాకెట్ ప్రయోగ సమయాన్ని ముందుకు జరిపారు. దీనిద్వారా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రయోగాన్ని తొలుత 15వ తేదీ ఉదయం 9:32కు నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు, ఇప్పుడు దాన్ని నాలుగు నిమిషాలు ముందుకు జరిపి 9:28కి మార్చారు. 14వ తేదీ తెల్లవారుజామున 5:48కి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం షార్ లోని క్లీన్ రూములో ఉపగ్రహాలకు పరీక్షలు జరుగుతున్నాయి. వీటిని ఈ నెల 9వ తేదీన రాకెట్ శిఖర భాగాన అమర్చే ప్రక్రియ మొదలుకానుంది. ఆపై రెండు రోజుల పాటు తుది పరీక్షలు నిర్వహించి, 12న ఎంఆర్ఆర్ సమావేశం జరిపి, కౌంట్ డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.

More Telugu News