: ఏదైనా ఉగ్రదాడి జరిగితే ఆ న్యాయమూర్తిదే బాధ్యత... ఆయనను నిలదీయాలని ట్రంప్ నిప్పులు

ముస్లిం దేశాలపై తానిచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై స్టే ఇచ్చిన శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా జడ్జి జేమ్స్ రాబర్ట్ పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శల వర్షం కురిపించారు. ఏదైనా ఉగ్రదాడి జరిగితే ఆయనదే బాధ్యతని అన్నారు. అమెరికాను ఇంత పెద్ద ఆపదలోకి ఒక న్యాయమూర్తి నెట్టేస్తారని తాను నమ్మలేకున్నానని, ఏదైనా జరిగితే న్యాయవ్యవస్థను తప్పుపట్టాలని ప్రజలను కోరారు. దేశంలోకి శరణార్థులు వెల్లువలా వచ్చి పడుతున్నారని, ఇది అత్యంత విచారకరమని అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు చేస్తూ, యూఎస్ కు వచ్చే వారిని జాగ్రత్తగా తనిఖీలు చేయాలని చెప్పి అధికారులను ఆదేశించినా, ఆ పనిని కోర్టులు కఠినం చేశాయని ఆరోపించారు. సదరు జడ్జి అభిప్రాయం హాస్యాస్పదమని, అమెరికన్లు అతన్నే తప్పు పట్టాలని చెప్పారు. రష్యాతో సంబంధాలపై స్పందిస్తూ, ఉగ్రవాదులపై పోరాటంలో రష్యా సహకరిస్తే, ఆ దేశంతో కలసి సాగడానికి తనకు అభ్యంతరాలు లేవని అన్నారు. తాను పుతిన్ ను గౌరవిస్తానని, అంతమాత్రాన ఆయనతో స్నేహం చేస్తున్నట్టు కాదని ట్రంప్ తెలియజేశారు.

More Telugu News