: భూకంపంతో చిగురుటాకులా వణికిన ఉత్తరాది.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

భూ ప్రకంపనలతో సోమవారం రాత్రి ఉత్తరాది రాష్ట్రాలు చిగురుటాకులా వణికాయి. కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కదలడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. చండీగఢ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రాత్రి 10:30 గంటల సమయంలో భూమి కంపించింది. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లా కేంద్రంగా భూమికి 33 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్టు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.8 గా నమోదైంది.

ఈ భూకంపం సంభవించిన కొన్ని నిమిషాలకే ఢిల్లీలో 5.3 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. 30 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. అయితే ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన సమాచారం లేదు. భూకంపంపై సమాచారం అందుకున్న ప్రధాని నరేంద్రమోదీ అక్కడి పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. భూకంప నష్టంపై ఆయా రాష్ట్రాల నుంచి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివేదికలు కోరారు. భూకంప సమాచారం అందుకున్న ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు సహాయ కార్యక్రమాల కోసం రుద్రప్రయాగ్ చేరుకున్నాయి.

More Telugu News