: హాలీవుడ్ నటి ఇంట్లో లక్ష్మీ దేవికి పూజ!

హాలీవుడ్ నటి, సింగర్ తన ఇంట్లో భారతీయ దేవతకు పూజలు నిర్వహించింది. అమెరికన్ సింగర్ మైలీ సైరస్ లక్ష్మీదేవికి పూజ నిర్వహించి తన భక్తిని చాటుకుంది. సూపర్ బౌల్ 2017 నేషనల్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ సందర్భంగా త్వరలో ప్రదర్శన ఇవ్వనున్న మైలీ, తన షో విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ పూజ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా తన ఇంటిని పూల మాలలతో అలంకరించానని, లక్ష్మీ దేవికి పూజ చేసే సమయంలో అమ్మ వారి  ఫొటోతో పాటు, తాను ఆరాధించే కొందరు వ్యక్తుల ఫొటోలనూ ఉంచినట్లు ఆ ఫొటోల ద్వారా తెలుస్తోంది. వేద పండితులతో పూజ నిర్వహించి, అమ్మ వారికి నైవేద్యం సమర్పించింది.

More Telugu News