trump: డొనాల్డ్ ట్రంప్ కు మరో తలనొప్పి... కోర్టుకెక్కిన 97 టెక్ దిగ్గజ కంపెనీలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయగానే తీసుకున్న నిర్ణయాలు ఆయనకు తలనొప్పి తెచ్చి పెడుతున్నాయి. ఏడు ముస్లిం దేశాల ప్ర‌జ‌లు త‌మ దేశంలోకి రాకుండా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం కొట్టివేసిన అనంత‌రం ఆయ‌న‌కు టెక్ దిగ్గజాల నుంచి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. ఆయా కంపెనీల నుంచి లీగల్ వార్ ప్రారంభ‌మైంది. ట్రంప్ విధించిన ఆంక్ష‌ల‌కు వ్యతిరేకంగా మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్ వంటి 97 టెక్నాలజీ దిగ్గజాలు ఆ దేశంలోని న్యాయ‌స్థానంలో మోషన్ రూపంలో ఫిర్యాదు దాఖలు చేశాయి.

ట్రంప్ విధిస్తోన్న ఆంక్ష‌లు చట్టాలకు, రాజ్యాంగానికి వ్యతిరేకమ‌ని ఆయా సంస్థ‌ల ప్ర‌తినిధులు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న స‌ద‌రు నిర్ణ‌యాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభను తాము ఆకట్టుకోవడాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ఇటువంటి లీగల్ పిటిషన్ ఇంత‌కు ముందు అమెజాన్, ఎక్స్ పీడియాలు కూడా దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

More Telugu News