supreme court: మొబైల్ నెంబర్ల వివరాలన్నింటినీ తప్పనిసరిగా స్వీకరించండి: కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు

దేశంలో ప్రస్తుతం 100 కోట్లకు పైగా మొబైల్ యూజర్లు ఉన్నార‌ని, ప్రతి యూజర్ గుర్తింపున‌కు సంబంధించిన వివరాలను ఏడాది లోపు సేకరించాలని కేంద్ర ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారందరికీ ఆధార్ నెంబ‌రును తప్పనిసరిగా అనుసంధానం చేయాలని, వారి వివరాలు సేకరించేందుకు సరియైన మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ప్రీ పెయిడ్ సిమ్ కార్డుల గుర్తింపున‌కు సంబంధించి కూడా వివరాలు తీసుకోవాల‌ని కోర్టు తెలిపింది. వినియోగ‌దారుల వెరిఫికేషన్ అనేది ఎంతో ప్ర‌ధాన‌మైంద‌ని పేర్కొన్న న్యాయ‌స్థానం.. దేశంలో ఇప్పుడు బ్యాంకింగ్ కార్యకలాపాలకు మొబైల్ ఫోన్లనే వాడుతున్న విష‌యాన్ని గుర్తు చేసింది. ఈ అంశంపై ఎన్జీఓ లోక్ నీతి ఫౌండేషన్ దాఖలుచేసిన పిటిష‌న్ మేర‌కు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. సిమ్ కార్డుల దుర్వినియోగాలకు పాల్పడకుండా ఈ చ‌ర్య‌లు త‌ప్ప‌కుండా తీసుకోవాల్సిందేన‌ని చెప్పింది.

More Telugu News