: ‘తలాక్’కి, ఎన్నికలకు ముడిపెట్టొద్దు: వెంకయ్య నాయుడు

‘తలాక్’ అంశానికీ, ఎన్నికలకు ముడిపెట్టొద్దని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ట్రిపుల్ తలాక్ అంశం విషయంలో బీజేపీ మొదటి నుంచి స్పష్టంగా ఉందని, ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని అన్నారు. ట్రిపుల్ తలాక్ పై తాము మొదటి నుంచి స్పష్టమైన వైఖరిని అవలంబిస్తున్న విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేస్తామన్నారు. సమాజంలో ముఖ్యంగా మహిళలకు సమాన హక్కులు, గౌరవం లభించాలని అన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్.. ఏ మతం అయినా మహిళలు దోపిడీకి గురి కాకూడదన్నదే తమ ఉద్దేశమని అన్నారు. కాగా, యూపీ ఎన్నికల అనంతరం తలాక్ అంశంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ట్రిపుల్ తలాక్’ పై నిషేధం విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

More Telugu News