: జయలలిత కాళ్లు తొలగించలేదు... ముఖంపై గాయాలకు కారణమిదే!: డాక్టర్ బేలే

చికిత్స అందిస్తున్న సమయంలో జయలలిత కాళ్లు తొలగించినట్టు వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని ఆమెకు చికిత్స అందించిన లండన్ వైద్యుడు డాక్టర్ బేలే తెలిపారు. ఆమె శరీరం నుంచి ఏ ఒక్క అవయవాన్ని తొలగించడం కాని, ట్రాన్స్ ప్లాంట్ చేయడం కానీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. మెడికల్ టేపులు వేయడం వల్లే ఆమె ముఖంపై గాయపు గుర్తులు పడ్డాయని చెప్పారు. ఆసుపత్రిలో చేరినప్పుడు ఆమె కనీసం మాట్లాడలేక పోయారని... కొంతమేర చికిత్స అందించిన తర్వాతనే ఆమె స్పృహలోకి వచ్చి, మాట్లాడటం మొదలుపెట్టారని తెలిపారు. 

More Telugu News