: రక్తంలో బ్యాక్టీరియా ఉండటంతో దెబ్బతిన్న జయలలిత అవయవాలు!

శ్వాస పీల్చుకోవడంలో సమస్యలు తలెత్తడంతో జయలలితను సెప్టెంబర్ 22 రాత్రి 10.30 గంటలకు అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చారని డాక్టర్ బాబూ అబ్రహాం తెలిపారు. ఇన్ ఫెక్షన్ వల్ల ఆమెకు శ్వాస సమస్యలు ఏర్పడినట్టు అనుమానించామని చెప్పారు. అయితే సెప్పిస్ (రక్తంలో బ్యాక్టీరియా ఉండటం) వల్ల ఆమె అవయవాలు దెబ్బతిన్నాయనే విషయాన్ని పరీక్షల అనంతరం నిర్ధారించామని తెలిపారు. సెప్పిస్ అత్యంత వేగంగా మనిషి శరీరమంతా వ్యాపిస్తుందని... దాని దెబ్బకు కొన్ని గంటల్లోనే మనిషి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. జయ ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయిలో ఉండటం వల్ల ఆమెను వెంటిలేటర్ పై ఉంచాల్సి వచ్చిందని తెలిపారు. వెంటిలేటర్ పైకి వెళ్లగానే ఆమెకు నిద్రమాత్రలు ఇచ్చామని... అందువల్ల ఆమెతో మాట్లాడలేకపోయామని చెప్పారు.

జయ చనిపోయిన ముందు రోజు సాయంత్రం 5 గంటలకు ఆమెకు తీవ్ర గుండెపోటు వచ్చిందని బాబూ అబ్రహాం చెప్పారు. వెంటనే కార్డియాక్ సీపీఆర్ మొదలుపెట్టామని... సుమారు 20 నిమిషాలు సీపీఆర్ చేశామని తెలిపారు. అయినా గుండె స్పందన రాలేదని... వెంటనే ఎక్మో టీమ్ ను రంగంలోకి దింపామని చెప్పారు. 24 గంటలపాటు ఎక్మోపై చికిత్స అందించామని... ఎక్మో మెషీన్ పని చేస్తూనే ఉందని, కానీ జయలలిత గుండె మాత్రం ఆగిపోయిందని చెప్పారు. ఆ తర్వాత జయ మరణ వార్తను ఆమె కుటుంబానికి తెలిపి, ఎక్మో మెషీన్ ను తొలగించామని తెలిపారు. 

More Telugu News