: డొనాల్డ్ ట్రంప్ కు ఝలక్కిచ్చిన మరో న్యాయస్థానం... స్టే ఎత్తివేతకు ససేమిరా!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరో న్యాయస్థానం ఝలక్కిచ్చింది. తానిచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై సియాటెల్ న్యాయస్థానం ఇచ్చిన స్టే ఆర్డర్ ను తొలగించాలని కోరుతూ, శాన్ ఫ్రాన్సిస్కో కోర్టును ట్రంప్ ఆశ్రయించగా, అక్కడ చుక్కెదురైంది. సియాటెల్ కోర్టు ఆదేశాలను తాము నిలిపివేయలేమని, ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ జరగాల్సి వుందని పేర్కొంది. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

అంతకుముందు ప్రభుత్వం తన వాదన వినిపిస్తూ, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని అధ్యక్షుడు నిర్ణయాలు తీసుకునే విశేషాధికారాన్ని కలిగివుంటారని, ఆయన ఉత్తర్వులను నిలిపివేస్తే, తప్పుడు సంకేతాలు వెళతాయని పేర్కొంది. వెంటనే స్టే ఆదేశాలను తొలగించాలని కోరగా, అందుకు న్యాయమూర్తి అంగీకరించలేదు. ఇదిలావుండగా, ట్రంప్ వైఖరిని నిరసిస్తూ న్యూయార్క్, వాషింగ్టన్ సహా లండన్, పారిస్ దేశాల్లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క, ఎట్టి పరిస్థితుల్లోనూ సియాటెల్ కోర్టు స్టే ఆర్డర్ ను రద్దు చేయించి తీరుతామని ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

More Telugu News