: ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ తలనరికిన ట్రంప్!.. దుమారం రేపుతున్న జర్మనీ వారపత్రిక కార్టూన్!

ఓ చేతిలో కత్తి.. మరో చేతిలో ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ తల నరికి పట్టుకున్న ట్రంప్ కార్టూన్‌ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. జర్మనీకి చెందిన ప్రముఖ వారపత్రిక ‘డెర్ స్పీగల్’ పత్రిక కవర్ పేజీపై ఈ కార్టూన్ వేసింది. ఈ కార్టూన్‌ను ప్రచురించిన పత్రికపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జర్మనీ పత్రికలు కూడా కార్టూన్‌పై విమర్శలు గుప్పించాయి. జర్మనీ ఉపాధ్యక్షుడు కూడా మండిపడ్డారు. విమర్శల జడివానలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కార్టూనిస్ట్ ఎడిల్ రోడ్రిగ్జ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం తలనరికనట్టు వచ్చే అర్థంలోనే ఈ కార్టూన్‌ను గీసినట్టు వివరణ ఇచ్చారు.

More Telugu News