: శశికళ పేరు వస్తే చీలికే... దీపతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రహస్య భేటీ

నేడు జరిగే కీలక అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతగా శశికళా నటరాజన్ ను ఎన్నుకున్న పక్షంలో పార్టీలో చీలిక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే శశికళ వ్యతిరేక వర్గంలోని కొందరు ఎమ్మెల్యేలు జయలలిత మేనకోడలు దీపా రాజకుమార్ తో రహస్యంగా భేటీ అయి చర్చలు సాగించినట్టు తెలుస్తోంది. నేటి సమావేశం శశికళను సీఎంగా ఎన్నుకునేందుకు కాదని అన్నాడీఎంకే వర్గాలు వెల్లడిస్తున్నప్పటికీ, శశికళే సీఎం అన్న ఊహాగానాలు మాత్రం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

ఇక రాజీనామా చేసేందుకు పన్నీర్ సెల్వం అంగీకరించబోరన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో శశికళ పేరు నేటి సమావేశంలో వినిపించి, ఆమెను సీఎంగా చేసేందుకు ప్రయత్నాలు జరిగితే అన్నాడీఎంకే మూడు ముక్కలు కావడం ఖాయమని తెలుస్తోంది. పన్నీర్ సెల్వం వర్గం, శశికళ వర్గంతో పాటు, కొందరు ఎమ్మెల్యేలతో దీప కూడా రంగంలో ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

More Telugu News