: ఎవరు రావాలో, వద్దో చెప్పలేనప్పుడు ఈ పదవి ఎందుకు?: ట్రంప్

దేశంలోకి ఎవరు రావాలో, ఎవరు రాకూడదో నిర్ణయించే అధికారం లేనప్పుడు అధ్యక్ష పదవి ఎందుకని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇమిగ్రేషన్ విధానంపై తానిచ్చిన కార్యనిర్వాహక ఆదేశాలపై సియాటెల్ కోర్టు స్టే విధించడంపై ఆయన స్పందించారు. కోర్టు ఆదేశాలు హాస్యాస్పదమని చెప్పిన ఆయన, పరిపాలనా వ్యవహారాల్లో కోర్టుల జోక్యం ఎందుకని ప్రశ్నించారు. దేశంలోకి ఉగ్రవాదులు చొరబడి దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలని న్యాయస్థానాలు సలహా ఇస్తున్నట్టుందని, కోర్టుల వైఖరితో ఇది చాలా పెద్ద సమస్యగా మారే ప్రమాదముందని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతానికి కోర్టుల నిర్ణయాన్ని అమలు చేస్తామని, వీటిపై అపీలుకు వెళ్లే ఆలోచనలో ఉన్నామని ట్రంప్ వర్గం వెల్లడించిన సంగతి తెలిసిందే.

More Telugu News