: క్యూ కట్టిన ఓటరు... గోవాలో రికార్డు స్థాయిలో పోలింగ్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు. గత ఎన్నికలతో పోలిస్తే, ఈ సారి గోవాలో పోలింగ్ శాతం పెరిగింది. 83 శాతం మంది ఓటర్లు ఓటేశారని అధికారులు ప్రకటించారు. మార్గోవాలోని 8వ నెంబరు పోలింగ్ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరించినట్టు తేలడంతో రీపోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ కేంద్రంలో రీపోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది.

ఇక పంజాబ్ విషయానికి వస్తే, 70 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2012లో జరిగిన ఎన్నికల పోలింగ్ శాతం 78.06తో పోలిస్తే, ఈ దఫా ఓటింగ్ శాతం తగ్గింది. పంజాబ్ లో 70 శాతం మంది ఓటు వేసినట్టు ఈసీ ప్రకటించింది. పంజాబ్ లో అనధికారికంగా తరలుతున్న రూ. 58 కోట్ల నగదు, రూ. 13.34 కోట్ల విలువైన మద్యం, 2,598 కిలోల మాదకద్రవ్యాలను పట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

More Telugu News