: ఈసారి బహిరంగ లేఖ ద్వారా మోదీని మరోసారి ప్రశ్నించిన గౌతమి

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోజుల్లో ఆమె ఆరోగ్యంపై గోప్యత పాటించారని, సందర్శించేందుకు వచ్చిన ప్రముఖులకు ఆమెను చూపించలేదని, ఆమె ఆరోగ్యం, మృతిపై పలు సందేహాలున్నాయంటూ సినీ నటి గౌతమి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై పీఎంవో నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గౌతమి మరోసారి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఈసారి బహిరంగ లేఖ రాసింది. ఈ లేఖలో ప్రధాని మోదీ తమిళనాడు సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించింది.

 అంతే కాకుండా గతంలో తాను రాసిన లేఖపై ఇంతవరకు ఎందుకు సమాధానం ఇవ్వలేదని ప్రశ్నించింది. ఆ లేఖ వివరాల్లోకి వెళ్తే... డిజిటలైజేషన్‌ కు చాంపియన్‌ ను అంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పేర్కొంటుంటారని, సోషల్‌ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటూ దేశ ప్రజలనుద్దేశించి గొప్పగొప్ప ప్రసంగాలు చెబుతారని గుర్తు చేసిన ఆమె, తాను రాసిన లేఖపై ఇంతవరకు స్పందించలేదని తెలిపింది. భారతదేశమంతా తనకు ఒకటేనని ఆయన భావిస్తే, దక్షిణాదిలో ప్రధానంగా తమిళనాడులో ఏర్పడిన సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ఆమె ప్రశ్నించింది. జయలలిత మృతిపై ప్రజల్లో ఏర్పడిన సందేహాలను ఎందుకు నివృత్తి చేయలేదని ఆమె అడిగింది. 

More Telugu News