: 'నీట్'లో ఇకపై మూడు ఛాన్సులే!

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశార్హత కోసం జాతీయ స్థాయిలో సీబీఎస్ఈ 'నీట్' పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఏపీలో ఈ పరీక్ష లేనప్పటికీ ఈ ఏడాది నుంచి ఏపీలో కూడా వైద్య విద్యకు ఈ పరీక్షనే రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ పరీక్షపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మెడికల్ కౌన్సిల్‌ తో కలిసి పలు కొత్త నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది మే 7న నీట్ జరగనుంది. ఈ పరీక్ష రాసేందుకు గరిష్ఠ వయోపరిమితి 25 ఏళ్లని స్పష్టం చేశారు. రిజర్వుడు కేటగిరీల వారికి ఐదేళ్ల సడలింపు ఉంటుంది. అయితే ఎవరైనా సరే ఈ పరీక్షను గరిష్ఠంగా మూడుసార్లు మాత్రమే రాసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

దీనిని సీబీఎస్ఈ తన వెబ్‌ సైట్‌ లో కూడా బులెటిన్ రూపంలో పొందుపరిచింది. ఇప్పటికే మూడుసార్లు ఏఐపీఎంటీ/నీట్ పరీక్ష రాసినవాళ్లు ఈసారి పరీక్షకు హాజరయ్యే అర్హత లేదని స్పష్టం చేసింది. ఇకపై మాత్రం కొత్తగా ఈ ఏడాది అటెంప్ట్ ను తొలిసారిగా నమోదు చేస్తారని, ఈ సారికి గతంలో ఏఐపీఎంటీ/నీట్ రాసినవాళ్లను కూడా అనుమతించనున్నారని తెలిపారు. అయితే వారు గరిష్ఠ వయోపరిమితి నిబంధనను మాత్రం దాటకూడదని తెలిపారు. అలాగే పై కారణంతో ఇప్పటికే ఏవైనా దరఖాస్తులను తిరస్కరించి ఉంటే, వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని తెలిపారు. 

More Telugu News