: స్కాంలో a అంటే అమిత్ షా... m అంటే మోదీ

SCAM అంటే సమాజ్ వాదీ పార్టీ (S), కాంగ్రెస్ పార్టీ (C), అఖిలేష్ యాదవ్ (A), మాయావతి (M) అంటూ కొత్త భాష్యం చెబుతూ, స్కాం కావాలో లేక రాష్ట్ర అభివృద్ధి కావాలో తేల్చుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ యూపీ ఓటర్లకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దీటుగా సమాధానమిచ్చారు. ఔరయ్యా ఎన్నికల సభలో అఖిలేష్‌ మాట్లాడుతూ, స్కాం (scam) లో ఆయన చెప్పినట్టు a అంటే తన పేరు కాదని, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అని స్పష్టం చేశారు.

 అలాగే m అంటే ఆయన చెప్పినట్టు మాయావతి కాదని, సాక్షాత్తూ మోదీయేనని ఆయన కౌంటర్‌ ఇచ్చారు. అంతే కాకుండా దేశాన్ని మోదీ, అమిత్‌ షాల నుంచి రక్షించాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రజలంతా మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు తమకు మద్దతిస్తారని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. కాగా, యూపీలో జరుగుతున్న హోరాహోరీ ప్రచారంలో రాజకీయ పార్టీలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి .

More Telugu News