: చిన్న పొరపాటు బాలిక జీవితాన్ని కాటేసింది!

చిన్న పొరపాటు ఓ బాలిక నిండుజీవితాన్ని నాశనం చేసిన ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే... ఛత్తీస్ గఢ్ కు చెందిన 15 ఏళ్ల బాలిక బంధువుల ఇంటికి వెళ్తూ పొరపాటున హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ రైలెక్కి ఢిల్లీలో దిగింది. స్టేషన్లో బెదురు బెదురుగా నిల్చున్న బాలికకు ధైర్యం చెప్పిన నీళ్లబాటిల్స్ అమ్మే అర్మాన్ అనే యువకుడు ఆమెను కాలేఖాన్ ప్రాంతంలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ భార్య హసీనా సహకారంతో అత్యాచారం చేశాడు. అనంతరం 70,000 రూపాయలకు పప్పూయాదవ్ అనే యువకుడికి బాలికను అమ్మేశాడు. అతను నరకం చూపించడంతో ఎలాగోలా తప్పించుకున్న బాలిక అక్కడ ఎవర్ని నమ్మాలో తెలియక మరోసారి నరకంలోకి వెళ్లినట్టుగా...తనతో బాగా మాట్లాడిన హసీనా దగ్గరకు వెళ్లింది.

దీనిని మరో అవకాశంగా మలచుకున్న హసీనా మత్తుమందిచ్చి మరో గదిలోకి తీసుకెళ్లింది. అక్కడ మహ్మద్ అఫ్రోజ్ అనే యువకుడు బాలికపై అత్యాచారం చేసి, హసీనాకు డబ్బులిచ్చాడు. మత్తువదిలిన బాలిక తన పరిస్థితి చూసుకుని కుమిలిపోయి అక్కడి నుంచి కూడా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఐపీసీ సెక్షన్ 363, 366, 376, 328,506, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు పప్పూయాదవ్, అఫ్రోజ్ లను అదుపులోకి తీసుకున్నారు. 

More Telugu News