: హర్భజన్ తో సెల్ఫీలు.. పోలింగ్ సిబ్బంది తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ జలంధర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. తన తల్లి అవతార్ కౌర్, ఇతర కుటుంబ సభ్యులతో కలసి 23వ నంబర్ పోలింగ్ బూత్ కు వచ్చాడు. అందర్లాగానే క్యూలో నిలబడి, బూత్ లోపలికి అడుగుపెట్టాడు. హర్భజన్ ను చూడగానే పోలింగ్ అధికారులు, సిబ్బంది ఉత్సాహానికి లోనయ్యారు. భజ్జీతో కలసి సెల్ఫీలు దిగారు. ఈ వీడియోలు కాస్తా మీడియాలో ప్రసారం కావడంతో... పోలింగ్ సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడాడు భజ్జీ. మొన్నటి వరకు పంజాబ్ లో కాంగ్రెస్, అకాలీ-బీజేపీ కూటములే ఎన్నికల బరిలో ఉండేవని... ఇప్పుడు ఆప్ కూడా వచ్చిందని చెప్పాడు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా... వారి పార్టీకి కాకుండా, రాష్ట్రానికి ప్రాధాన్యతను ఇవ్వాలని కోరాడు. 

More Telugu News