demonitisation: డిమానిటైజేష‌న్ ప్ర‌భావం కొంత‌కాల‌మే.. జీడీపీ వృద్ధి రేటు 7 శాతం ఉంటుంది: శ‌క్తికాంత్ దాస్

పెద్ద‌నోట్ల ర‌ద్దు ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడడంతో కేంద్ర‌ ఆర్థిక‌శాఖ కార్య‌ద‌ర్శి శ‌క్తికాంత్ దాస్ మ‌రోసారి స్పందించారు. ఈ రోజు న్యూ ఢిల్లీలో ఫిక్కీ స‌ద‌స్సులో పాల్గొని మాట్లాడిన ఆయ‌న... డిమానిటైజేష‌న్ ప్ర‌భావం కొంత‌కాల‌మే ఉంటుంద‌ని, వ‌చ్చే ఏడాది మ‌న‌ జీడీపీ వృద్ధి రేటు 7 శాతం దాటుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కేంద్ర ప్ర‌భుత్వం రెండు రోజుల క్రితం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌పైన కూడా ఆయ‌న స్పందిస్తూ... ఈ బ‌డ్జెట్ స‌ర్కారు విధానాల‌కు అనుగుణంగా ఉంద‌ని తెలిపారు. దేశంలో తీసుకొస్తోన్న‌ సంస్క‌ర‌ణ‌లు, ట్యాక్స్‌ విధానాల‌కు అనుగుణంగా ఈ బ‌డ్జెట్టును రూపొందించార‌ని పేర్కొన్నారు.

More Telugu News