: కన్ను పోవడానికి కారణమైంది.. ఆమె కన్ను తీసేయండి: ఇరాన్ సుప్రీంకోర్టు తీర్పు

ఓ మహిళపై మరో మహిళ యాసిడ్ పోసిన ఘటనలో ఇరాన్ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రెండేళ్ల క్రితం సీమా అనే మహిళపై మరో మహిళ యాసిడ్ పోసింది. ఆ ఘటనలో బాధితురాలు కంటి చూపును కోల్పోయింది. కేసును విచారించిన సుప్రీంకోర్టు... కంటి చూపును కోల్పోవడానికి కారణమైన నేరస్తురాలికి ఒక కన్ను పీకేయాలంటూ తీర్పును వెలువరించింది. ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం ఈ తీర్పును ఇచ్చింది.

అంతేకాదు, బాధితురాలికి నష్ట పరిహారం చెల్లించాలని, ఏడేళ్ల జైలు శిక్షను అనుభవించాలని ఆదేశించింది. 1979లో ఇరాన్ లో షరియా చట్టం అమల్లోకి వచ్చింది. శారీరక గాయాలు ఏర్పడిన కేసుల్లో ప్రతీకార శిక్షలకు షరియా చట్టం అనుమతిస్తుంది. అయితే, బాధితులు కాని, వారి కుటుంబ సభ్యులు కానీ దయ చూపితే, శిక్ష అమలు కాకుండా ఆపేయవచ్చు.

More Telugu News