: మమ్మల్ని మినహాయించండి: ట్రంప్ కు మైక్రోసాఫ్ట్ మొర

తమ ఉద్యోగులను ట్రావెల్ నిబంధనల నుంచి మినహాయించాలని, వీసా, ఇమిగ్రేషన్, బార్డర్ సెక్యూరిటీ చట్టాలపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను తమకు వర్తించకుండా ఆదేశాలు ఇవ్వాలని శుక్రవారం నాడు టాప్ అమెరికన్ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ మొరపెట్టుకుంది. ఈ మేరకు యూఎస్ విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్ సన్, హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ జాన్ కెల్లీలకు, మైక్రోసాఫ్ట్ చీఫ్ లీగల్ ఆఫీసర్ బ్రాడ్ ఫోర్డ్ ఎల్ స్మిత్ లేఖ రాశారు. తమ సంస్థలో పనిచేస్తున్న వారిలో 76 మంది ఉద్యోగులు, వారిపై ఆధారపడిన 41 మంది నాన్ ఇమిగ్రెంట్లు, ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.

ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో తాము సంప్రదించామని, వారంతా భయపడుతున్నారని, కుటుంబాల నుంచి తమ ఉద్యోగులు విడిపోవాల్సిన పరిస్థితిని కల్పించవద్దని స్మిత్ కోరారు. ఉద్యోగ విధుల నిమిత్తం వారు విదేశీ ప్రయాణాలు సాగించాల్సి వస్తుందని, వారు తిరిగి అమెరికాలో కాలు మోపేందుకు అనుమతించాలని అడిగారు. ఎటువంటి నేర చరిత్రా లేని వారిని మాత్రమే తాము ఉద్యోగులుగా తీసుకుంటున్నామని, వారితో ఎలాంటి ఇబ్బందులూ రావని హామీ ఇచ్చారు.

More Telugu News