: తిమింగలం కడుపులో ప్లాస్టిక్ కవర్లు.. ఆశ్చర్యపోయిన పరిశోధకులు!

నార్వే సముద్రతీరంలో ఓ భారీ తిమింగలం అంతిమ క్షణాల్లో మెరైన్ బయాలజిస్టులకు కనిపించింది. దాని మరణ వేదన చూడలేక, దానికి కారుణ్య మరణం ప్రసాదించారు. ఈ సందర్భంగా వెలుగు చూసిన షాకింగ్ నిజాలను వారు బయటి ప్రపంచానికి వెల్లడించారు. దాని మృతికి గల కారణాలను అన్వేషించేందుకు డెన్మార్క్ లోని యూనివర్సిటీ ఆఫ్ బెర్జిన్ పరిశోధకులు దానికి వివిధ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆమె కడుపులో 30 ప్లాస్టిక్ బ్యాగులు, భారీ ఎత్తున మానవ వ్యర్థాలు బయటపడ్డాయి. ఇలా ప్లాస్టిక్ కవర్లను, మానవ వ్యర్థాలను తీసుకోవడం వల్ల ఆ తిమింగలం జీర్ణ వ్యవస్థ దెబ్బతిందని, వీటి కారణంగానే అది మృతి చెందిందని వారు పేర్కొన్నారు. 2050 నాటికి సముద్ర జలాల్లో చేపల కంటే మానవ వ్యర్థాల పరిమాణమే ఎక్కువని వారు వెల్లడించారు. 

More Telugu News