: పెళ్లి కాకుండానే ప్రియుడితో తిరుగుతోందని బెత్తం దెబ్బల శిక్ష!

ఓ యువతి వివాహం కాకుండానే ప్రియుడితో బయట కనిపించడంతో, ఇండొనేషియాలోని బండా ఎసె ప్రావిన్స్ లో అధికారులు 25 బెత్తం దెబ్బలను శిక్షగా విధించారు. బహిరంగంగా ఈ శిక్షను అమలు చేయగా, ఈ దృశ్యాలపై సామాజిక మాధ్యమాల్లో ప్రజలు మండిపడుతున్నారు. శిక్ష అమలు చేస్తుంటే, ఆ మహిళ తన మొహాన్ని చేతులతో కప్పుకుని ఏడుస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. కాగా, ఇండొనేషియాలో కఠినమైన షరియా చట్టం అమలవుతున్న ఒకే ఒక్క ప్రాంతం బండా ఎసె. షరియా చట్టాన్ని తొలగించాలని అక్కడ చానాళ్లుగా నిరసనలు జరుగుతున్నాయి.

More Telugu News