: ట్రంప్ వల్ల మనవాళ్లు బాగా ఇబ్బంది పడుతున్నారు!: చంద్రబాబు

ప్రత్యేక హోదా పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హోదాలో పారిశ్రామిక రాయితీలు ఉండవని, హోదా వల్ల వచ్చే అన్ని ప్రయోజనాలు ప్యాకేజీలో ఉన్నాయని ఆయన చెప్పారు. విద్యుత్, భూములు, నీటి వసతి కల్పించడం వల్ల ఏపీకి పరిశ్రమలు తరలి వస్తున్నాయని చెప్పారు. గత రెండు రోజుల్లోనే రూ. 1800 కోట్ల పెట్టుబడులతో పలు కంపెనీలు పనులను ప్రారంభించాయని తెలిపారు. పెట్టుబడులు వస్తున్నప్పుడు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. వాతావరణ కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని... పరిశ్రమల్లో స్థానికులకే ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో అక్కడున్న భారతీయులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని... భవిష్యత్తులో మన ఉద్యోగాలను మనమే సృష్టించుకుందామని అన్నారు.

More Telugu News