: ఏడు నెలల ఒబామా శ్రమను ఒక్క సంతకంతో బుట్టదాఖలు చేసిన ట్రంప్!

ఇస్లామిక్ రాజ్యానికి అనధికారిక రాజధానిగా ఉన్న రఖా నగరాన్ని విడిపించేందుకు దాదాపు ఏడు నెలల పాటు తన మంత్రులు, సలహాదారులతో చర్చలు జరిపి ఒబామా తయారు చేసుకున్న యుద్ధ ప్రణాళికను ట్రంప్ ప్రభుత్వం తోసిపుచ్చింది. నిద్రాహారాలు మాని, ఎన్నో వందల గంటలు పనిచేసి, తన టీమ్ తయారు చేసిన సవివరణాత్మక ప్లాన్ ను, జనవరి 17న అధికార మార్పిడి ప్రక్రియలో భాగంగా ఒబామా స్వయంగా ట్రంప్ చేతికి అందించారు. ఉత్తర సిరియా ప్రాంతంలో కుర్దూ దళాలకు ఎటువంటి ఆయుధాలు ఇవ్వాలన్న విషయం నుంచి, నగరంలోకి ఎలా చొచ్చుకెళ్లాలి? ఉగ్రవాద స్థావరాలు ఎక్కడ ఉన్నాయి? వారి వద్ద ఉన్న ఆయుధాలు... తదితర వివరాలన్నీ ఇందులో ఉన్నాయి.

ఉగ్రవాదులే తొలి శత్రువులంటూ ఈ ప్లాన్ ను అమలు చేయాలని ఒబామా కోరగా, వివరాలు సంతృప్తిగా లేవని, ఈ ప్లాన్ తో ముందడుగు వేస్తే, ఉగ్రవాదులను తుదముట్టించలేమని ట్రంప్ జాతీయ భద్రతా కమిటీ అభిప్రాయపడింది. దీంతో ఈ ప్రణాళికను బుట్టదాఖలు చేసిన ట్రంప్, వారు కొంత సమాచారాన్ని మాత్రమే అందించారని, అందులోనూ లొసుగులున్నాయని వ్యాఖ్యానించడం గమనార్హం.

More Telugu News