: ఫేస్‌బుక్‌కు భారీగా జరిమానా విధించిన కోర్టు

తమ టెక్నాలజీని చౌర్యం చేసిందని అమెరికన్ టెక్ కంపెనీ ఓక్యులస్‌పై వీడియో గేమ్స్ తయారీ సంస్థ జెనిమాక్స్ కోర్టుకెక్కింది. తాజాగా ఈ కేసును విచారించిన న్యాయ‌స్థానం కేసుతో సంబంధం ఉన్న ఫేస్‌బుక్‌కు భారీ జ‌రిమానా విధించింది. 50 కోట్ల డాలర్ల జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది. 2014లో ఫేస్‌బుక్ సంస్థ‌ ఓక్యులస్‌ నుంచి వర్చ్యువల్ రియాలిటీ టెక్నాలజీని 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే, ఆ టెక్నాల‌జీ త‌మ‌దంటూ జెనిమ్యాక్స్ దావా వేయ‌డంతో ఫేస్‌బుక్ ఇంత భారీ మొత్తంలో జ‌రిమానా చెల్లించుకోనుంది. ఈ కేసులో ఫేస్‌బుక్ సీఈవో జుకెర్‌బర్గ్ కూడా జ‌న‌వ‌రిలో డల్లాస్ ఫెడరల్ కోర్టుకి వ‌చ్చి విచారణను ఎదుర్కొన్నారు.

  

More Telugu News