: ఒబామా సర్కార్‌లా ఉదాసీనంగా వుంటామనుకుంటున్నారా?: అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ హెచ్చరిక

మొదట తమ వద్ద అణ్వాయుధాలు లేవని చెప్పిన ఇరాన్.. నిన్న ఓ ప్రక‌టన చేస్తూ తాము అణు క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు తేల్చి చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ అమెరికా ఇరాన్‌పై దృష్టి పెట్టాల‌ని ప్రత్యేక నోటీసులు జారీ చేస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిందని అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ మైఖెల్‌ ఫ్లిన్ పేర్కొన్నారు. డొనాల్డ్‌ ట్రంప్ సర్కారులో ఆ దేశ‌ జాతీయ భద్రతా సలహాదారుగా ఆయ‌న ఇటీవ‌లే బాధ్యతలు చేపట్టిన విష‌యం తెలిసిందే. తొలిసారిగా ఆయ‌న‌ మాట్లాడుతూ... బరాక్‌ ఒబామా స‌ర్కారుని బ‌హిరంగంగా విమ‌ర్శించారు.

ఇరాన్ చేస్తున్న విపరీత చర్యలపై ప్రతిస్పందించడంలో ఒబామా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయ‌న అన్నారు. ఆ కారణంగానే ఇప్పుడు ఇరాన్ ఇలా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని చెప్పారు. ఇటీవల యెమెన్‌లో ఇరాన్‌ జరిపిన అణు క్షిపణుల పరీక్షలపై ఆయ‌న స్పందిస్తూ.. టెహ్రాన్‌ దుశ్చర్యలకు ఇవి నిదర్శనమ‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఆ దేశం ఇప్పుడు తమ‌ది ఓ దుర్బలమైన దేశంగా భావిస్తోందని చెప్పారు. ఇందుకు గ‌త‌ ఒబామా సర్కార్ విఫ‌ల‌మ‌వ‌డ‌మే కార‌ణ‌మ‌ని అన్నారు. తాము ఇక‌పై ఇరాన్‌ కదలికలను ఎప్ప‌టిక‌ప్పుడు పసిగడతామని అన్నారు. అలాగే తాము బ‌రాక్‌ ఒబామా ప్ర‌భుత్వంలా ఉదాసీనంగా ఉండబోమ‌ని ఉద్ఘాటించారు.

More Telugu News