: షాక్ ఇచ్చిన చైనా... ఒకేసారి 10 అణ్వాయుధాలతో క్షిపణి పరీక్ష!

చైనా తాజాగా ఓ కొత్త తరహా క్షిపణి పరీక్షను నిర్వహించింది. ఆ క్షిప‌ణికి ఒకేసారి 10 అణ్వాయుధాలను అమర్చి ఈ పరీక్ష జ‌రిపినట్లు నిపుణులు చెబుతున్నారు. ఒక‌వైపు ఇటీవ‌లే ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గ‌తంలో చైనాపై త‌న వ్య‌తిరేక వైఖ‌రిని ప‌లుసార్లు ప్ర‌ద‌ర్శించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ పరిపాలన కాలంలో త‌మ‌ సైనిక శక్తి చూపాల్సి వస్తుందేమోనని భావిస్తోన్న చైనా... తాము సమర్థంగా క్షిపణి ఆయుధాలను ఉపయోగించగలమని చెప్పే సంకేతాలిచ్చేందుకే ఈ సాహ‌సం చేసిన‌ట్లు నిపుణులు అంటున్నారు.

ఒకేసారి పది న్యూక్లియర్‌ వార్‌ హెడ్స్‌ను ఉపయోగించి డాంగాఫెంగ్‌-5సీ పరీక్ష జరపడం ఇదే మొద‌టిసారని, తాము కొన్ని రోజుల ముందే ఈ పరీక్షలు చేసినట్లు చైనా పేర్కొంది. ఈ క్షిపణికి అమర్చిన పది క్షిపణులు స్వతంత్రంగా పది రకాల వాహనాలను లక్ష్యంగా దాడి చేసే సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉన్నాయ‌ని తెలిపింది. త‌మ దేశంలోని షాంగ్జీలోని తైవాన్‌ స్పేస్‌ లాంచింగ్‌ సెంటర్‌ నుంచి ఈ పరీక్ష నిర్వహించినట్లు చెప్పింది. చైనా గతంలో డాంగ్‌ఫెంగ్‌-5 క్షిపణిని తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఈ క్షిప‌ణిని కొత్త తరహాలో తీసుకొచ్చారు.

More Telugu News