: చిటారు కొమ్మల్లో చిక్కుకున్న ఎస్సై మృతదేహం...ఏవోబీ మావోల ఘాతుకంలో కొత్త కోణం

ఏవోబీలో మావోయిస్టులు పేల్చిన బాంబు పేలుడులో 11 మంది ఆచూకీ లభ్యం కాగా, ఇద్దరి ఆచూకీ ఇంకా దొరకలేదు. అయితే నిన్న సాయంత్రం మరణించిన వారితో పాటు, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన సందర్భంగా ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని, వారికి చికిత్స అందిస్తున్నామని విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రి వద్ద పోలీసులు తెలిపారు. కాగా, నేటి తెల్లవారు జాము నుంచే కూంబింగ్ మొదలు పెట్టిన పోలీసులు మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మావోయిస్టులు జరిపిన పేలుళ్లకు సంబంధించిన అవశేషాలు సేకరించారు.

అలాగే పేలుడు సందర్భంగా 25 అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డ వ్యాన్ నుంచి ఓ ఎస్సై మృతదేహం ఎగిరి చెట్టు కొమ్మలపై పడింది. దీంతో ఆయన మృతదేహం ఎవరికీ కనిపించలేదు. పోలీసులు చెట్టుపై చిక్కుకున్న వ్యాన్ విడిభాగాలు సేకరించే క్రమంలో ఎస్సై మృతదేహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. పెద్దఎత్తున బలగాలను, డాగ్ స్క్వాడ్, యాంటీ బాంబ్ స్క్వాడ్ ను తరలించి కూంబింగ్ ప్రారంభించారు. 

More Telugu News