: విశాఖ ఏజెన్సీలో వీడని మంచు!

విశాఖ ఏజెన్సీలో ఇంకా మంచుతెరలు వీడడం లేదు. సాధారణంగా డిసెంబర్, జనవరి తొలి వారం వరకు ఉండే మంచు, చల్లగాలుల ప్రభావం ఈ ఏడాది మరింతగా కొనసాగుతోంది. సంక్రాంతి తరువాత నుంచి చలి తీవ్రత తగ్గుతూ నెలాఖరుకు పూర్తిగా తగ్గుతుంది. దీంతో అంతవరకు విశాఖ ఏజెన్సీని వణికించే చలి, దట్టంగా అలముకునే పొగమంచు కరిగిపోతాయి. అయితే ఈ ఏడు అలా జరగడం లేదు. ఇంకా ఏజెన్సీని చలి వణికిస్తోంది. దట్టంగా అలముకున్న పొగమంచు సూర్యుడొచ్చే వరకు వెళ్లడం లేదు. దీంతో బారెడు పొద్దెక్కాక కానీ ఏజెన్సీ వాసులకు తెల్లారడం లేదు. ఈ నేపథ్యంలో చింతపల్లిలో 14 డిగ్రీల సెల్సియస్, అరకులో 16 డిగ్రీలు, పాడేరులో 17 డిగ్రీలు నమోదయ్యాయి. దట్టంగా అలముకుంటున్న పొగమంచు కారణంగా, జీడి, మామిడి పూత రాలిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News