: హవాయి ద్వీపంలో పేలిన అగ్ని పర్వతం... కాలువలా ప్రవహిస్తున్న లావా!

ఫసిఫిక్ మహాసముద్రంలో ఉన్న హవాయి ద్వీపంలో అగ్నిపర్వతం పేలింది. దీంతో దీని నుంచి భారీ ఎత్తున లావా ఎగసి పడుతోంది. కాలువలా ఎగసిపడుతున్న లావా నేరుగా ఫసిఫిక్ మహాసముద్రంలో కలుస్తోంది. దీని ధాటికి పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కరిగిపోతున్నాయి. దీంతో జియోలాజికల్ శాస్త్రవేత్తలు, అధికారులు హవాయి ద్వీపంలో ఉన్న ప్రజలను హెచ్చరించారు. భారీ ఎత్తున లావా ఫసిఫిక్ మహాసముద్రంలో కలిసిపోతుండడంతో భూమి అడుగు భాగంలో ఖాళీ ఏర్పడి సింక్ హోల్స్ ఏర్పడే ప్రమాదం ఉందని, భూమి ఆ ఖాళీ మేరకు లోపలికి కుంగిపోతుందని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. దీంతో టూరిస్టు ద్వీపంగా పేరొందిన హవాయిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

More Telugu News