: ధోనీ అర్ధ సెంచరీ... గౌరవప్రదమైన స్కోరు వైపు టీమిండియా

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్వేచ్ఛగా బ్యాటు ఝళిపించాడు. మూడు టీ20ల సిరీస్ లో సిరీస్ నెగ్గాలంటే గెలిచి తీరాల్సిన చివరి టీ20లో ధోనీ తనదైన శైలిలో భారీ షాట్లు ఆడుతూ ఆకట్టుకున్నాడు. రైనా (63) నిష్క్రమణ అనంతరం జూలు విదిల్చాడు. తనకు మాత్రమే సాధ్యమైన భారీ షాట్లను సుదీర్ఘ విరామం తరువాత ఆడాడు. దీంతో అర్ధ సెంచరీతో సత్తాచాటాడు. అనంతరం జోర్డన్ వేసిన 18వ ఓవర్ ను ధోనీ (51), యువరాజ్ (27) భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులెత్తించారు. తొలి బంతిని సింగిల్ చేసిన ధోనీ, యువీకి బ్యాటింగ్ రొటేట్ చేశాడు. అంతే, తరువాతి బంతిని యువీ సిక్సర్ బాదాడు. ఆ తరువాతి బంతిని కూడా సిక్సర్ కొట్టాడు. తరువాతి బంతిని బౌండరీ బాదాడు. తరువాతి బంతిని మరో సిక్సర్ కొట్టాడు. దీంతో స్కోరు బోర్డు ఒక్కసారిగా జెట్ స్పీడు అందుకుంది. ఈ క్రమంలో కేవలం 17 బంతుల్లో ఇద్దరూ 44 పరుగులు జోడించారు. అనంతరం మిల్స్ వేసిన స్లో బంతిని అంచనా వేయడంలో తడబడ్డ యువీ టచ్ చేసి, కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 18.2  ఓవర్లలో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. 

More Telugu News