: 'అరుణాచల్ ప్రదేశ్ లో షూటింగా? వామ్మో..' అంటున్న 'రంగూన్' సినిమా యూనిట్

రెండో ప్రపంచం యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న బాలీవుడ్ సినిమా 'రంగూన్' తెరవెనుక కష్టాలను ఓ మేకింగ్ విడియోలో యూనిట్ బట్టబయలు చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ఇంకా అభివృద్ధి చెందలేదని, టాయిలెట్లు కూడా అందుబాటులో లేవని తెలిపింది. అందుకే తాము ఈ షూటింగ్ లో చాలా కష్టాలు ఎదుర్కొన్నామని తెలిపింది. రాళ్ల వెనుకే కాలకృత్యాలు తీర్చుకునేవాళ్లమని గుర్తు చేసుకుంది. షాహిద్ కపూర్ మాట్లాడుతూ, ఇంత కఠినమైన ఔట్ డోర్ షూటింగ్ తన కెరీర్ లో చూడలేదని అన్నాడు. గడ్డకట్టే చలిలో అందరం ఒకేచోట గుమిగూడి ఉండేవారమని, బయటకు వెళ్తే జలగల భయమని చెప్పారు. అక్కడికీ తనను జలగలు పట్టుకున్నాయని, అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని షూటింగ్ పూర్తి చేశామని వారు తెలిపారు. కాగా, ఈమధ్యే విడుదలైన ట్రైలర్ లో ఓ 'బోల్డ్' సీన్ ఉండడంతో దానికి విశేషమైన ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. 

More Telugu News