smart phone: బ్లాక్‌బెర్రీ నుంచి మరో ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్..!

ప్ర‌ముఖ మొబైల్ ఉత్ప‌త్తుల కంపెనీ బ్లాక్‌బెర్రీ నుంచి మ‌రో స్మార్ట్‌ఫోన్ విడుద‌ల కానుంది. దీనికి  'బీబీసీ100-1 మోడ‌ల్ పేరు పెట్టారు. ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 ప్రదర్శనలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను స‌ద‌రు కంపెనీ విడుదల చేయనుంది. 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామ‌ర్థ్యంతో ఈ ఫోన్ ను విడుద‌ల చేయ‌నున్నారు. 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు దీని ఫీచ‌ర్లుగా ఉన్నాయి. దీని ధర వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News