: కేంద్ర బడ్జెట్ పై అమరావతి రైతుల ఆనందం.. టపాకాయలు కాల్చి, సంబరాలు చేసుకున్న వైనం

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకు కేంద్ర బడ్జెట్ లో వరమిచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. అమరావతికి భూములిచ్చిన రైతులకు ఆదాయపు పన్ను ఉండదని, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదని జైట్లీ ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల అమరావతి రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. తమకు పన్ను మినహాయింపు ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నా ఎవరూ నమ్మలేదని... కానీ, చివరకు అది కార్యరూపం దాల్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మీద అపారమైన నమ్మకంతోనే తామంతా రాజధానికి భూములిచ్చామని చెప్పారు. చంద్రబాబుపై తమకున్న నమ్మకం ఇప్పుడు రెట్టింపయిందని అన్నారు. మొత్తం 24 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూమిని రాజధాని కోసం ఇచ్చిన సంగతి తెలిసిందే. 

More Telugu News