: 'ఇండియా టుడే' పంజాబ్ ఒపీనియన్ పోల్స్ ఫలితాలు ... కాంగ్రెస్ కు పట్టం కట్టనున్న ఓటర్లు!

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రచార తీవ్రత పెరుగుతోంది. పార్టీలన్నీ ప్రత్యర్థులపై దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీ-అకాలీదళ్ కూటమిని విమర్శిస్తుండగా, ఈ కూటమి, కాంగ్రెస్, ఆప్ లను లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎలాంటి ఫలితాలు సాధించనుందంటూ ఇండియా టుడే- యాక్సిస్‌ సర్వే నిర్వహించాయి. ఈ ఎగ్జిట్‌ పోల్స్ లో బీజేపీకి షాకింగ్‌ ఫలితాలొచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం దుర్లభమని సర్వే తెలిపింది. మరీ ఘోరంగా ఆ కూటమికి కేవలం 11-15 సీట్లు మాత్రమే లభిస్తాయని సర్వే స్పష్టం చేసింది.

అదే సమయంలో పంజాబ్ లో విజయం ఆశిస్తున్న ఆప్ కు కూడా ఫలితాలు సానుకూలంగా ఉండవని, అయితే మరీ ఘోరంగా మాత్రం ఆ పార్టీ ఓటమిపాలు కాదని సర్వే తెలిపింది. ఈ క్రమంలో ఆ పార్టీ 40-44 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే పేర్కొంది. చాలా కాలంగా పంజాబ్ లో విజయం కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, అందుకు కావాల్సినన్ని సీట్లను ఆ పార్టీ గెలుచుకుంటుందని సర్వే తెలిపింది. కాంగ్రెస్ కు 60-65 సీట్లు దక్కుతాయని ఈ సర్వే ప్రకటించింది. 

More Telugu News