: ట్రంప్ వ్యతిరేక ర్యాలీల్లో దూసుకెళ్తున్న ఎన్ఆర్ఐలు.. ప్లకార్డులపై ఘాటు పదాలు!

ఏడు దేశాల నుంచి వచ్చే ముస్లిం శరణార్ధులను యూఎస్ లోకి అడుగుపెట్టనివ్వమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలో నిరసనలు, ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రవాస భారతీయులు కూడా భారీ సంఖ్యలోనే పాల్గొంటున్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రవాస భారతీయుల్లో ప్లకార్డులు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే, ట్రంప్ ను ఉద్దేశించిన ఘాటైన వ్యాఖ్యలతో పాటు తిట్లు కూడా వాటిపై దర్శనమిస్తున్నాయి.

వాటిల్లో కొన్ని..‘డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఏ డాగ్’, ‘మీరు ఎంత అసహ్యించుకుంటున్నా, మీకు చాయ్ అందించేందుకు మా బామ్మలు సిద్ధంగా ఉన్నారు’, ‘మా అమ్మానాన్నల పొట్టపై కొట్టకండి, మా ఆకలితో ఆటలాడుకోకండి’ అని రాసి ఉన్న ప్లకార్డులు కనపడుతున్నాయి. అంతేకాదు, రాయడానికి, చెప్పడానికి వీలు కాని భాషలో ట్రంప్ ను తూర్పారబడుతున్న ప్లకార్డులు లేకపోలేదు. 

More Telugu News