: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ‘మైక్రోసాఫ్ట్’ దావా!

అమెరికాకు ముస్లిం దేశాల నుంచి వలసలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిమితం చేయడంపై ప్రముఖ సంస్థ ‘మైక్రోసాఫ్ట్’ తీవ్రంగా స్పందించింది. ఇమ్మిగ్రేషన్ కార్యనిర్వాహక ఆదేశాలను సదరు సంస్థ సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో ఫెడరల్ కోర్టులో దావా వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇమ్మిగ్రేషన్ ఆంక్షలపై ఇప్పటికే ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల విమర్శలు గుప్పించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై ముఖ్యంగా హెచ్ 1బీ వీసాలపై ఆంక్షల ప్రతిపాదనలపై భారత ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. 

More Telugu News