: ఇలాంటి వాటిని ఇప్పటికే చాలా చూశాం: పాకిస్థాన్ పై ఘాటుగా స్పందించిన భారత్

ఉగ్రవాదం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తుండటం పాకిస్థాన్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ నేపథ్యంలో, ముందస్తు చర్యగా ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా ఉగ్ర సంస్థ హఫీజ్ సయీజ్ సయీద్ ను గృహ నిర్బంధం చేసినట్టు పాక్ ప్రకటించింది. అయితే, ఈ వార్తలపై భారత్ ఘాటుగా స్పందించింది. హఫీజ్ ను గృహ నిర్బంధం చేయడం ఇదే మొదటిసారి కాదని... గతంలో ఇలాంటివి చాలా చూశామని వ్యాఖ్యానించింది.

ముంబై దాడుల సూత్రధారిపైనా, పాక్ భూభాగంపై ఉన్న ఉగ్ర సంస్థలపైనా చిత్తశుద్దితో దాడిచేయాలని... తన నిజాయతీని చాటుకోవాలని సూచించింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ మాట్లాడుతూ, హౌస్ అరెస్టులు సరిపోవని, నమ్మకమైన దాడులు జరిగితేనే పాక్ నిజాయతీ బహిర్గతమవుతుందని అన్నారు. ఫలాహ్ ఏ ఇన్సానియేత్, జమాత్ ఉద్ దవా సంస్థలను నిఘా పెట్టాల్సిన సంస్థల జాబితాలో చేర్చే ప్రయత్నాలను పాక్ హోంశాఖ చేస్తున్నట్టు తెలుస్తోందని ఆయన చెప్పారు.

More Telugu News