: ‘నాకు నచ్చిన చైతన్య-సమంత ఫొటో ఇదే!’ అంటున్న నాగార్జున

సినీ ప్రేమ జంట నాగ చైతన్య, సమంత నిశ్చితార్థం రెండు రోజుల క్రితం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, నాగ చైతన్య తండ్రి నాగార్జున ఈ ఎంగేజ్ మెంట్ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే, ఆ ఫొటోల్లో తనకు నచ్చిన ఫొటో ఇదేనంటూ ఒక ఫొటోను నాగార్జున ప్రత్యేకంగా పేర్కొన్నాడు. ‘ఐ లవ్ దిస్ పిక్చర్. ప్రేమలో మునిగిపోయిన చైతన్య సమంత!!’ అని తన ట్వీట్ లో తెలిపాడు. కాగా, నాగ చైతన్య, సమంత ఎంగేజ్ మెంట్ కోసం తన దుస్తులు డిజైన్ చేసిన శిల్పారెడ్డికి కృతఙ్ఞతలు చెబుతూ నాగార్జున మరో ట్వీట్ చేశారు. శిల్పారెడ్డితో కలిసి ఉన్న ఒక ఫొటోను నాగ్ పోస్ట్ చేశారు.  

More Telugu News