china: మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులేసిన రణ్‌వీర్‌ సింగ్

ప్రముఖ సినీ నిర్మాత, రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్బరామిరెడ్డితో క‌లిసి సినీన‌టులు చిరంజీవి, రణ్‌వీర్‌ సింగ్ ఓ వేదిక‌పై ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ వేసిన ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. సుబ్బ‌రామిరెడ్డి మనవడు కేశవ్‌, వీణల వివాహ వేడుక సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన సంగీత్‌లో వీరంతా క‌లిసి స్టెప్పులు వేశారు. ఈ సంగీత్‌కి టాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రముఖులు హాజ‌ర‌య్యారు. అటూ ఇటూ చిరు, ర‌ణ్‌వీర్ సింగ్ మ‌ధ్య‌లో సుబ్బ‌రామిరెడ్డి అంద‌రినీ హుషారెత్తించే స్టెప్పులు వేశారు. ఇదే వేడుక‌లో అక్షయ్‌, రణ్‌వీర్‌లు పాటలు కూడా పాడి అల‌రించారు.

More Telugu News