: రూ.50 వేల విలువ చేసే ఆభరణాలు కొంటే ఇకపై పాన్ కార్డ్ లేదా ఆధార్ తప్పనిసరి

బంగారం లేదా వెండి ఆభరణాలను కొనడానికి వెళ్లాల‌నుకుంటున్న వారు ఇక‌పై వారితో పాటు త‌మ పాన్‌కార్డ్ లేదా ఆధార్ ను కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. 2017 బడ్జెట్ ప్రకటన నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయని స‌మాచారం. బంగారు దుకాణాల్లో రూ.50వేల కంటే ఎక్కువ విలువ‌చేసే ఆభ‌ర‌ణాలు కొనాల‌నుకుంటే ఈ నిబంధ‌న వ‌ర్తిస్తుంద‌ని తెలుస్తోంది. ప్రస్తుతం రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఆభరణాలు కొనుగోలు చేసేవారికి మరిన్ని నిబంధనలు వర్తిస్తున్న విష‌యం తెలిసిందే. వారు బంగారం మార్కెట్లో కేవైసీ కంప్లియన్స్‌ను  సమర్పిస్తున్నారు.

ఆయా మార్కెట్ల‌లో కైవేసీ అవసరాన్ని ప్రస్తుతమున్న రూ.2 లక్షల నుంచి మరింత తగ్గిస్తారని కూడా తెలుస్తోంది. ఇక‌పై రూ.50వేలకు కేవైసీ కంప్లియన్స్ ను  తీసుకొస్తారని విశ్లేష‌కులు అంటున్నారు. డీమానిటైజేషన్ అనంతరం న‌ల్ల‌ధ‌న కుబేరులు త‌మ డ‌బ్బుని ప‌లు రూపాల్లో నిల్వ చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రిపిన‌ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంటూ వస్తోంది. ప్ర‌జ‌లు ఎంత మొత్తంలో బంగారం కొనుగోళ్లు చేపట్టి అక్రమాలకు పాల్పడ్డారో తెలుసుకునే విషయంలో సంబంధిత శాఖ‌లు ప్ర‌స్తుతం శ్ర‌మిస్తున్నాయి.

More Telugu News