: పార్లమెంటు సిత్రాలు... సోనియా పక్కన అద్వానీ, మోదీ పక్కన గులాంనబీ ఆజాద్

ఈ సంవత్సరం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వేళ, ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా, అధికార, ప్రతిపక్ష దిగ్గజ నేతలు ఒకరి పక్కన ఒకరు ఆసీనులై ఉండటం కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ పక్కన కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ కూర్చోగా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పక్కన బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ కనిపించారు. ఈ సభను ఉద్దేశించి ప్రణబ్ మాట్లాడుతూ, తన ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో గత ప్రభుత్వాలకన్నా మిన్నగా ఉందని వ్యాఖ్యానించారు.

నల్లధనాన్ని అరికట్టే దిశగా, ఇటీవల తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో దేశం అభివృద్ధి దిశగా ఒకేసారి రెండడుగులు వేసినట్లయిందని అభివర్ణించారు. దేశంలో లంచగొండితనం తగ్గినట్టు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ఎల్పీజీ సబ్సిడి స్వచ్ఛందంగా వదులుకోవాలని పిలుపు ఇస్తే, 1.20 కోట్ల మంది స్పందించడం ప్రభుత్వానికి గర్వకారణమని తెలిపారు. స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకున్న వారందరికీ కృతజ్ఞతలని, వారి నిర్ణయంతో మరింత మంది పేదలకు వంట గ్యాస్ దగ్గరైందని అన్నారు. 1.4 లక్షల గ్రామాలు, 450 నగరాలు, పట్టణాలు 77 జిల్లాలు, 3 రాష్ట్రాలు ఇప్పటికే బహిరంగ మల విసర్జన లేని ప్రాంతాలుగా మారాయని తెలిపారు.

More Telugu News