: నా వయసు పాతికేళ్లే... అందుకే ఇలాంటి పాత్రల్లో చేస్తున్నా: హన్సిక

తమిళంలో చాలా సినిమాలు చేతిలో ఉండటం వల్లే... తెలుగు పరిశ్రమకు కొంత కాలంగా దూరమయ్యాయని హీరోయిన్ హన్సిక తెలిపింది. ఇప్పుడు తాను నటించిన 'లక్కున్నోడు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని... జయం రవితో కలసి నటించిన తమిళ సినిమా 'భోగన్' కూడా తెలుగులోకి అనువాదం అవుతోందని చెప్పింది. మరోవైపు సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నానని... ఇంత వరకు తాను అలాంటి పాత్ర చేయలేదని చెప్పింది.

మహిళా ప్రాధాన్యత గల పాత్రలను చేయడానికి తనకు ఇంకా చాలా టైమ్ ఉందని హన్సిక తెలిపింది. తన వయసు ఇంకా పాతికేళ్లే అని... అందుకే కుర్ర హీరోల పక్కన రొమాంటిక్ పాత్రల్లోనే నటిస్తున్నానని చెప్పింది. ఈ మధ్య కాలంలో తాను బరువు తగ్గిన విషయంపై మాట్లాడుతూ, ఆరు నెలల్లో 13 కిలోల బరువు తగ్గానని తెలిపింది. దీనికోసం ఎలాంటి డైటింగ్ చేయలేదని... తన తల్లి చెప్పిన మెనూని ఫాలో అయ్యానని చెప్పింది.

More Telugu News